Thursday 10 May 2018

మహానటి !

మహానటి !

ఇది సినిమా రివ్యూ కాదు.. మహానటి సినిమా మీద నా భావాలు మాత్రమే !!

మహానటి సావిత్రి మొన్నటి , నిన్నటి తరాల్ని తన అందం తో, అభినయం తో మంత్ర ముగ్ధుల్ని చేస్తే.. ఈ తరం వాళ్లకు ఆమె లేని లోటు ని ఆమె బయోపిక్ "మహానటి" తీరుస్తాది. అందుకు గాను ముందు గా ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్న దర్శక నిర్మాతలకు అభినందనలు..!



సావిత్రి తండ్రి లేని చిన్న పిల్ల..
తండ్రి ప్రేమ తెలియని చిన్న పిల్ల..
తండ్రి రూపు గుర్తు లేని చిన్న పిల్ల..

స్వయానా పెదనాన్న నాన్న అని పిలువమంటే మురిసిపోయి "మా నాన్న మా నాన్న" అని చెప్పుకున్న ప్రేమ అనే లోటు ఉన్న కన్నె పిల్ల..

నాన్నకు మీసాలు ఉంటాయా అంటూ అమ్మని అడిగే సావిత్రి పాత్రని ఆరేళ్ల పాప గా పరిచయం చేసినప్పటి నుండి - ఒక గాలి కబురు విని తండ్రి ఫోటో కోసం వెతుక్కుంటూ వెళ్ళే స్టార్ గా చూపించడం లో దర్శకుడు "సావిత్రి ప్రేమ కు ఇచ్చే విలువ " చెప్పకనే చెప్పాడు !!

జెమినీ గణేశన్ ! ఒక మాటకారి.. నాకు పెళ్లయింది.. ఒక అక్రమ సంబంధం ఉంది.. కానీ నేను ప్రేమించింది మాత్రం నిన్నేఅని నిజం చెప్పి ఒప్పించగలిగే అంత మాటకారి..!

అన్నీ తెలిసి కూడా "నా మీద ప్రేమ" తనని మారుస్తాది అని నమ్మిన పదహారేళ్ల అమ్మాయి - అన్నీ తెలిసి చేసుకున్న తర్వాత ఇంక మారడం ఎందుకు అనుకున్న బాధ్యత తెలియని భర్త ల సంఘర్షణ లో మనం కోల్పోయింది ఒక "మహానటి" ని !!



నేర్పించక పోతే పొండి కానీ నాకు రాదు అనడానికి మీరు ఎవరు అని సొంతం గా నాట్యం నేర్చుకున్న పట్టుదల సావిత్రి సొంతం !

ఆ పట్టుదలే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చింది..!

తను కొబ్బరి లౌజు లు కొనడం మానేసి ముసలి తాత భోజనానికి సాయం చేసిన చిన్నారి సావిత్రి అంత పెద్ద స్టార్ ఐన తర్వాత చేయకుండా ఉంటాదా? ఉండదు.. పోనీ సర్వం కోల్పోయాక ఉంటాదా? అప్పుడు కూడా ఉండదు.. అవసరం అయితే చీర అమ్మి మరీ సాయం చేస్తాది. అది సావిత్రి అంటే.. !!

పదహారేళ్ల వయసులో ఎవ్వరితో చర్చించకుండా తనకు తాను గా సావిత్రి తీసుకున్న (ఆ అవకాశమే ఇవ్వనట్టు ఉన్నాడు జెమినీ "ఉన్నదీ ఒకటే జన్మయితే" అనే ఒక్క డైలాగ్ తో జెమినీ గణేశన్ సావిత్రి ని ఎమోషనల్ గా కంట్రోల్ చేశాడా అన్నంతగా చాలా బాగా చూపించారు ఈ సినిమాలో ) నిర్ణయం తో కుటుంబానికి దూరమైన సావిత్రి.. తన భర్త గురించి తెలుసుకుని దూరమయ్యి ఒంటరిగా మిగిలింది..



భర్త కు ఐతే దూరం అయ్యింది కానీ భర్త నేర్పిన అలవాటు కి కాదు.. ! అదే ఆమె కు శాపం గా మారింది. సూరిటీ లు, సినిమా డైరెక్షన్ లు , తెలిసిన వాళ్ళ చేతిలో మొసపోవడాలు.. కారణాలు ఏమైనా అన్నీ మహానటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని క్షీణింప చేసాయి !

 "చివరకు మిగిలేది" చేసిన మంచి తప్ప ఏమి లేదని చెప్పకనే చెప్పింది !

 ఇన్ని పార్శ్వాలు ఉన్న పాత్రని కీర్తి సురేష్ అద్భుతం గా పోషించింది ! కాదు జీవించింది ! కాదు కాదు ఆ సావిత్రమ్మే కీర్తి గా తిరిగొచ్చింది అనుకునేంత బాగా చేసింది !!
నాగేశ్వర రావు ని చూడటానికి గేట్ కీపర్ కి కితకితలు పెట్టిన అల్లరి పిల్ల లో నాగేశ్వర రావు వచ్చాడా అని నాగేశ్వర రావు నే అడిగిన అమాయకపు పిల్ల !

గా అలరించిన కీర్తి..! కార్ రేస్ లో పాల్గొన్న సావిత్రి ఆత్మభిమానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది !



గెస్ట్ హౌస్ సీన్ లో సావిత్రి అనుమానం, సావిత్రి అవమానం, సావిత్రి కోపం, సావిత్రి బాధ కేవలం కళ్ళతోనే పలికించింది కీర్తి ! కళ్ళతో నే అన్నీ భావాలు పలికించే సావిత్రి నే తన కళ్ళతో పలికించిన కీర్తి సురేష్ ఈ మహానటి సినిమా తో శాశ్వత కీర్తి పొందుతారు !

కీర్తి సురేష్ తరువాత అంత అద్బుతం గా తీర్చిన పాత్ర జెమినీ గణేశన్ ది.. ఆ పాత్ర లో సల్మాన్ దుల్కర్ చక్కగా ఒదిగిపోయాడు..! ఆ పాత్ర దర్శకుడు ఎంత బాగా తీర్చిదిద్దాడు అంటే జెమినీ సావిత్రి ని పెళ్ళి చేసుకోవాలి అని ప్రేక్షకులే కోరుకునే అంత గా.. ! జెమినీ సావిత్రి మీద ఈర్ష పెంచుకున్నప్పుడు , వేరే అమ్మాయి తో సంబంధం పెట్టుకున్నప్పుడు జెమినీ ని ద్వేషించేంత గా.. (ఈ ద్వేషం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉంటాది)



నిజానికి మహానటి సినిమా మనకి సావిత్రి ని మాత్రమే కాదు.. చక్రపాణి , ఎల్.వి. ప్రసాద్, వేదంతం రాఘవయ్య, అక్కినేని వంటి ఎందరినో చూపిస్తాది. అందరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.






సమంత పాత్ర ఎనభై ల కాలం నాటి చదువుకున్న అమ్మాయిని  (నాకెందుకో యద్దనపూడి గుర్తొచ్చారు !) మన ముందు ఉంచుతాది. క్లైమాక్స్ లో సమంత సంభాషణలు భావోద్వేగానికి గురిచేస్తాయి. దేవరకొండ విజయ్ పాత్ర బాగుంది.



సావిత్రి కధ ని సావిత్రి అభిమానించే ఒక ఫోటోగ్రాఫర్ ద్వారా కొంత, సావిత్రి పెద్దమ్మ దుర్గమ్మ ద్వారా కొంత, అలా వేరే వేరే కోణాల్లో నుండి చూపిస్తూ నడపడం చాలా బాగుంది !!

సినిమా కి సంగీతం, ఫోటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, ఆర్ట్ ప్రాణం పోసాయి..! మూగమనసులు సాంగ్ అయితే బాహుబలి హంస నావ సాంగ్ స్థాయి లో ఉంది !!

సమాప్తం !


Monday 2 April 2018

Rangasthalam !!

ఇది రివ్యూ కాదు ! కేవలం నా రంగస్థలం అనుభవం , అభిప్రాయం మాత్రమే !!


సినిమా రిలీజ్ ఐన నాలుగవ రోజు చూడటం తో అప్పటికే ఈ సినిమా గురించి ట్విట్టర్ లోను, ఫేస్బుక్ లోను చాలా పొగడ్తలు చూసాను. బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను, కానీ చరణ్ ని నటవిశ్వరూపం అని పొగుడుతుంటే నాకు కొంచెం భయం వేసింది ఎందుకంటే ఈ నటవిశ్వరూపం అని వీళ్ళు పొగిడిన ప్రతి సినిమా నాకు ఓవర్ యాక్టింగ్ గా అనిపించింది. బహుశా నట విశ్వరూపం అనే మాట కి విలువ తీసేసారు ఫాన్స్ ! ఈ మధ్య కాలం లో నాకు బాగా నచ్చిన నటన మాత్రం "అర్జున్ రెడ్డి" విజయ్ దేవరకొండ దే ! అలాంటి పాత్ర రావడం అదృష్టం వచ్చిన దాన్ని పోషిండం మహా కష్టం ! అలాంటి కష్ట తరమైన పాత్ర ని అవలీల గా పోషించి పడేసాడు చరణ్ ! ఆ పాత్ర చిట్టి బాబు ! 

నేను పుట్టి పెరిగింది అంతా ఒక రంగస్థలం లాంటి కుగ్రామం లోనే ! నా చిన్నపుడు చెక్క తలుపులు మీద , వీధి లో స్థంబాల మీద, కరెంటు స్థంబాల మీద ! పులి గుర్తుకే మీ వోట్ అని, కొబ్బరి చెట్టు గుర్తుకే మీ వోట్ అని పోస్ట్ కార్డు సైజు పోస్టర్ లు ఉండేవి ! జనరల్ ఎలక్షన్స్ కంటే వార్డ్ మెంబెర్ మరియుప్రెసిడెంట్ ఎన్నికలకు వాతావరణం చాలా వేడి గా ఉండేది.. కారణం ఎవరు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారో సాధారణ ఎన్నికల కంటే ఈ ప్రెసిడెంట్ , వార్డ్ మెంబెర్ ఎన్నికలలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది ! దానివల్ల కోపాలు , కక్షలు అన్ని బహిరంగం గానే జరుగుతుంటాయి !



 గతం లో అలాంటి ఎన్నికలు జరిగినపుడు ఎలాంటి వీరోచిత పోరాటాలు జరిగాయో గుడి అరుగు మీద కూర్చున్న ముసలోళ్ళు చెబుతుంటే మేమందరం కదలకుండా వింటూ ఉండేవాళ్ళం ! ఆ ఎన్నికల్లో నుంచున్న వాళ్ళు ఎవరో మాకు తెలీదు కానీ వాళ్ళు కొవ్వు పట్టిన ప్రెసిడెంట్ ని ఎదిరించారు అని చెబుతుంటే వాళ్ళ మీద అభిమానం పెంచుకునే వాళ్ళం ! ఇలా కొట్టుకుని ఉంటారా? అలా దారి కాసి ఉంటారా? అని ఊహించుకుంటూ ఉండేవాళ్ళం ! అలాంటి ఎనభైలలో ప్రతి ఊరు కధ ని ప్రధాన వస్తువు గా తీసిన కధే "రంగస్థలం "

కధ గా రంగస్థలం కొత్తది కాదు - ఇదివరకే చూసేసాం కాబట్టి !
పాతది కూడా కాదు - ఇప్పటికి జరుతున్నది కాబట్టి !

రూపు మారిందంతే , అప్పట్లో అధికారం లో ఉన్నవాళ్లు భౌతికం గా చంపేసే వాళ్ళు , ఇపుడు నైతికం గా చంపేస్తున్నారు ! అప్పట్లో ప్రెసిడెంట్ వెనక శక్తులు ఇపుడు చానెల్స్, డబ్బున్నవాళ్ళు,  రూపం లో ఇంకా ఆలా బ్రతికే ఉన్నాయి ! పాత కదా కాదు కొత్త కదా కాదు ! నిత్యం జరిగే కధ !!

రంగస్థలం పాత్రల రూప కల్పన ఆధారం గా తయారు చేయబడ్డ సినిమా ! ప్రతి పాత్ర వైవిధ్యం !

రంగమ్మత్థ - మొగుడు పోయినా , ఎలా పోయాడో తెలిసినా , ఎదిరించ లేని నిస్సహాయురాలు, తల వంచలేని ఆత్మభిమానురాలు ! చిట్టి బాబు కి తల్లిలా భోజనం పెట్టె, స్నేహితురాలి లా సలహాలు ఇచ్చే, మరదలి లా సరదలాడే లోతైన పాత్ర ! Kumari 21 F ని నాలుగు దశాబ్దాలు వెనక్కి, పట్నం నుండి పల్లెటూరి కి తీసుకెళ్తే రంగమ్మత్థ పాత్ర ! ఈ పాత్ర లో అనసూయ ఒదిగిపోయింది ! అక్కడక్కడా యాస మిస్ అయింది అంతే !



ప్రెసిడెంట్ గారు : ఆ నియోజిక వర్గానికి MLA గా గెలిచిన ప్రకాష్ రాజ్ కి ఈ ఊరు నుండి ఒక్క వోట్ కూడా పడలేదు అంటే ఈ ప్రెసిడెంట్ కి ఈ ఊరు మీద ఉన్న పట్టు అర్ధమవుతుంది ! ముప్పై ఏళ్ళు గా ఊరికి ప్రెసిడెంట్ అయినా కానీ రాజకీయం గా ఎదగలేదు అంటే ఈ ప్రెసిడెంట్ గారికి రాజకీయ ఎదుగుదల కన్నా ఆ ఊరిమీద ఆధిపత్యం ఇష్టం ! గెలవడం కష్టమేమో అని నమ్మిన బంటు అంటే చెంబు తో కొట్టి కొట్టి చంపేసెంత ఇష్టం !

జుబ్బా వేసుకుని ఉంటాడు , నిద్ర లేచి ఆరు బయట మొహం కడుక్కుంటాడు, తన ట్రాక్టర్ తనే నడుపుకుంటాడు ! కానీ ప్రజలు నోరు లేచిన, చెయ్యి లేచిన తట్టుకోలేడు ! ఆధిపత్యం అంటే అంత ఇష్టం ఆ ప్రెసిడెంట్ గారికి ! ఈ పాత్రలో జగపతి బాబు భయపెట్టాడు !



రామలక్ష్మి : మొదటి చూపుకే ఎంత సక్కగున్నావే అని చిట్టి బాబు ని పడేసిన అందం ! అప్పు తీరుస్తూ రసీదు తీసుకునే తెలివి ! పంచాయితీ లో నాకు తెలుసు నేను ఆరవ క్లాస్ చదివాను అని చెప్పుకునే ఆత్మభిమానం ! ఉన్న పాత్రలో సమంత చాలా బాగా చేసింది ! రంగమ్మ మంగమ్మా సాంగ్ లో సమంత చేసిన అల్లరి అదుర్స్ ! సినిమా మొదట్లో చిట్టి బాబు ని తిడుతు ప్రవేశించే రామలక్ష్మి పాత్ర , పతాక సన్నివేశం లో చిట్టి బాబు ప్రతీకారం లో నిశ్శబ్దం గా , హుందా గా , చిట్టి బాబు పక్కనే ఉంటుంది ! ఒక్క క్లైమాక్స్ సీన్ తో ఏమి మాట్లాడకుండా భర్త పక్కనే నడిచే రామలక్ష్మి పాత్ర కి బరువు పెంచేసాడు దర్శకుడు !




కుమార్ బాబు : వెలుగు పడే వరకు చీకట్లో బ్రతుకుతున్నాం అని తెలియని రంగస్థల ప్రజలకు వెలుగు తెచ్చే ప్రయత్నం చేసే అభ్యుదయ పాత్ర ! రంగస్థలం సినిమా కి చరణ్ హీరో అయితే , రంగస్థలం కధ కి చిట్టి బాబు హీరో అయితే , రంగస్థలం ఊరికి మాత్రం కుమార్ బాబు హీరో ! అలాంటి పాత్ర లో ఆది అద్భుతం గా నటించాడు ! తమ్ముడు ఆకలికి తట్టుకోలేడని ప్రెసిడెంట్ ని ప్రాధేయపడిన కుమార్ బాబు తమ్ముడు గట్టిగా కొట్టేసారు అన్నయ్య అంటే తట్టుకోగలడా ? చిట్టి బాబు తనని కొట్టిన పోలీస్ ని వేసేద్ద్ధం అంటుంటే , దాని వెనక ఉన్న ప్రెసిడెంట్ మీద నామినేషన్ వేసే దూర ద్రుష్టి గల పాత్ర ! తమ్ముడు తప్పు చేసాడు అంటున్నప్పుడు , తమ్ముడిని కొట్టి కాదు , తన పీకల మీద కత్తిపీట పెట్టుకున్న అన్న పాత్ర !

చరణ్ , ఆది కెమిస్ట్రీ ఇంకా అద్భుతం !  ఒక ఉదాహరణ ..

చిట్టి బాబు : ఏంట్రా వదిన ఏడుతుంది ?
కుమార్ బాబు : ప్రేమంటే అంతేరా !
చిట్టి బాబు: ఏడుపొచ్చేదే (అన్న మాట పూర్తి కాకముందే )



చిట్టి బాబు : సినిమా మొదట్లో ప్రెసిడెంట్ గారు  నామినేషన్ వేసే రోజు జాతరలో డాన్స్ చేసే "సాధారణ చిట్టిబాబు" ! ప్రీ క్లైమాక్స్ లో అదే ప్రెసిడెంట్ ని పాముని కొట్టినట్టు చితక కొట్టి కొట్టి చంపేస్తాడు !

మొదట్లో వినపడదు అని చెప్పుకోడానికి ఇష్టపడని, లోపాన్ని కవర్ చేసుకునే "అల్లరి చిట్టి బాబు" చివర్లో సరిగా వినపడదు కొంచెం గట్టిగా అడగండి అని అడ్రస్ చెప్తాడు !

ప్రెసిడెంట్ దగ్గర డబ్బు తీసుకుంటే అన్నయ్య పోటీ నుండి తప్పుకుంటాడు అనుకునే "అమాయకపు చిట్టి బాబు" , క్లైమాక్స్ లో అన్నయ్య ని చంపింది ప్రెసిడెంట్ కాదు అని కనుక్కుని అసలు వ్యక్తి ని బ్రతికించి , కారణం చెప్పి మరీ చంపేస్తాడు !



ఈ చిట్టి బాబు లో లేని షేడ్ లేదు, ప్రతి షేడ్ లోను చరణ్ ఇరగదీసాడు !

సినిమా మొదటి షాట్ లో ఒక వ్యక్తి ముందుకి వాలి, ఒగుర్చుకుంటూ  సైకిల్ తొక్కుతూ ఉంటాడు ,  ఆ షాట్ లో ఆలా ఒదిగిన చరణ్ సినిమా మొత్తం చిట్టి బాబు పాత్ర లో అలా ఒదిగిపోయాడు !

అన్న చనిపోయే సీన్ లో చెట్టు వెక్కి చూసే చిట్టి బాబు చిరుత పులిలా కనిపిస్తాడు , ఆ ఫైట్ మొత్తం ఒక మృగం లా వేటాడతాడు ! చిట్టి చిట్టి అని అన్నయ్య అరుస్తుంటే వినపడని చిట్టి బాబు తన చెవులు తనే కొట్టుకుంటూ ఉంటాడు ! బాటరీ లైట్ వెలుగు లో అన్నయ్య మొహం చుట్టూ రౌండ్ అప్ చేసిన రౌడీ లు ! వాళ్ళ చేతుల్లో కొడవళ్లు చుసిన చిట్టిబాబు ఒరేయ్ అని గర్జించి ఒక్క ఉరుకులో వాళ్ళని గెంటేస్తాడు ! ఆగి ఒక్కసారి అన్నయ్యని చూసుకుంటాడు ! కళ్ళలో కోపం , బాధ ఒకే సరి చూపించాడు చరణ్ ! వెంటనే అటునుంచి వస్తున్న ఇంకో ఇద్దరినీ దెబ్బ తిన్న పులిలా మీద పది కొడతాడు ! రాయికేసి బాదుతాడు ! ఊపిరి ఉందా పోయిందా చూస్తాడు ! అంత అయిపోయిన తర్వాత నీకేం కాదు రా నేను వచ్చేసాను గా అన్నపుడు అంటూ ఓదారుస్తాడు ! ఈ దెబ్బలు నాకు ఎన్ని తగల్లేదు అని ధైర్యం చెప్తాడు ! అన్నయ్య ఇంకా ఎపుడు చెప్పకుండా వెళ్లను అన్నపుడు మనస్పూర్తి గా నవ్వుతాడు ! బామ్మా పసుపు ఇవ్వు అంటే ఆ బామ్మా కారం డబ్బా ఇవ్వబోతే "కారం కధే బాబు పసుపు , కొంపలు ముంచేస్తావ్ " అని తనే చొరవగా పసుపు డబ్బా అందుకుంటాడు ! ఇన్ని వేరియేషన్స్ వెంట వెంటనే చిట్టి బాబు పాత్రలో చూపించిన చరణ్ ! నెక్స్ట్ అన్నయ్య చనిపోయిన తర్వాత " నువ్వేదో చెప్పే ఉంటావ్.. నాకే వినిపించి ఉండదు" అంటూ అందరిని ఏడిపించేస్తాడు !



అన్నయ్య శవాన్ని ఇంటికి చేర్చిన చిట్టి బాబు ! కళ్ళల్లో ఏడుపు ఆపుకుని  ! ప్రెసిడెంట్ ఇంటి మీదకి వెళ్లి , ప్రెసిడెంట్ పారిపోయాడని తెలిసి చేతిలో ఉన్న కొడవలి తో స్తంభాన్ని నరుకుతాడు ! ఇది నిజం గా చరణ్ విశ్వరూపం !! సుకుమార్ లో ఇంత మాస్ ఉందా అనుకునే సీన్ అది !!

ఇంటికి వచ్చిన చిట్టిబాబు బయట గోడకి జారబడి కత్తి తో రుబ్బురోలు మీద కొడుతూ ఉండిపోతాడు ! అప్పుడు కూడా అతని కంట్లో నీళ్లు ఉండవు ! లోపలి వచ్చి అన్నయ్య శవాన్ని గుండెలకి హత్తుకున్నపుడు కూడా కళ్ళల్లో నీళ్లు ఉండవు ! కానీ ఆ సన్నివేశం లో తన నటనతో నా కంట్లో బోర్ వేసేశాడు చిట్టి బాబు !

క్లైమాక్స్ లో సంచి లో కొడవలి పట్టుకుని వెళ్లి , కళ్ళు ముడుచుకుని కూర్చుని ప్రకాష్ రాజ్ ని మొత్తం వివరించే సీన్ ! చరణ్ ని ఎక్కడో నిలబెడతాది ! చిట్టి బాబు పాత్ర గురించి ఎంత చెప్పుకున్న తక్కువే !

మహేష్ - చిట్టి బాబు ని గురువు గారు అని పిలిచే , వెటకారం , మమకారం , మంచితనం అన్ని ఉన్న పాత్ర లో ఇరగదీసాడు ! జబర్దస్త్ మహేష్ !



నరేష్ : కొడుకు వచ్చాడని మెడ టేప్ తో వచ్చే టైలర్ కోటేశ్వర రావు ! కాళ్లకు ఏదో తగిలి తడబడి పక్కకి గెంటేస్తాడు ! కళ్ళు సరిగా కనపడవేమో అని ప్రేక్షకులు అనుకునే లోపు కొడుకు లోపలి తీసుకు వెళ్తూ కళ్ళళ డాక్టర్ కి చూపించుకున్నావా నాన్న అంటాడు ! అంత డిటైల్డ్ గా డిజైన్ చేసాడు సుకుమార్ ప్రతి పాత్ర ని !!

పోరా బయటకి చెవిటి నా కొడకా అని ఊగిపోయే సీన్, కొడుకు పోయినపుడు చెంబుతో వచ్చి కుప్పకూలిపోయి సీన్ , బియ్యం మొహం మీద కొట్టుకునే సీన్ ! అన్నిసీన్స్ లో నరేష్ ఇరగదీసాడు !!

అసలు ఈ పాత్రలను అన్ని ఇంత సహజం గా , ఇంత పర్ఫెక్ట్ గా సృష్టించిన సుకుమార్ ని ఎంత పొగిడినా తక్కువే !

రత్నవేలు అయితే మనల్ని ఆ ఊరు నడిమధ్యలో కుర్చోపెట్టేసాడు ! దేవి శ్రీ మ్యూజిక్ ప్రతి సీన్ ని ఎలేవేటే చేసింది ! వీళ్లిద్దరు మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం లో అద్భుతమైన నైపుణ్యం చూపించారు !


వెంటాడే కొన్ని మూమెంట్స్ !

రామలక్షి తనని కొట్టిన ఫీల్ అవ్వని చిట్టి బాబు, రామ లక్ష్మి వల్లే తన అన్నకి సొసైటీ ఆఫీస్ లో, తండ్రి కి పంచాయతీ లో అవమానం జాగిగిందని చెంపమీద కొడతాడు ! నన్ను అవమంచంచడం మాత్రం గట్టిగ చెబుతాది ఇదీ , ప్రేమ మాత్రం గట్టి గా చెప్పదు ఇదీ అని గొడవ పడటం ! పోలీస్ లు రావడం , రామ లక్ష్మి వచ్చి ముందు పెట్టు కోవడం ! పోలీస్ లను విడిపించుకుని చిట్టి బాబు ముద్దు పెట్టుకుని "ప్రేమంటే ఇంతేనే రామాలచ్చిమి ఏడుపొచ్చేది.. నువ్వేడకే రామాలచ్చిమి " అనే సీన్ !

మహేష్ ఆ లంజాకొడుకు మీ నాన్నమ్మ గారిని.. అని చెప్పి తలపట్టుకుని కూర్చుని.. పైకి చూస్తా చిట్టి బాబు కనపడక వెంటనే పక్క కి తిగితే చిట్టిబాబు కొరకంచి పట్టుకుని శేషు నాయుడు మీదకి వెళ్లడం , దేవి బిజిఎం !

కుమార్ బాబు పోస్టర్ వేస్తుంటే , చిట్టి బాబు కుమార్ బాబు శవాన్ని భుజాన వేసుకుని రావడం పోస్టర్ ఊడిపోవడం ! అప్పుడప్పుడే నిద్ర లేస్తున్న మహేష్ అరుపులు !

నాకు నువ్వంటే ఇష్టం కానీ మా అన్న అంటే ఇంకా ఇష్టం ! మా అన్న కోసం నిన్ను వదులున్నను , నా కోసం మీ నన్నయ వదులుకోలేవా ? అని చిట్టిబాబు రామ లక్ష్మి ని అడిగే సీన్ !

పోలీస్ స్టేషన్ నుండి నామినేషన్ వేయడానికి వెళ్లే సీన్..

పంట జప్తు చేస్తున్నాం అని జీప్ వెళ్తుండటం తోనే రైతు (జబర్దస్త్ శేషు ) గోదార్లోకి దూకేయ్యడానికి వెళ్తుండటం ! చిట్టి బాబు కాపాడటం , అందులో కూడా కామెడి!!

ఇంకా చాలానే ఉన్నాయి !

-సమాప్తం