Wednesday 11 January 2017

ఎలా చెప్పగలము అన్నయ్య ఇంతకన్నా ??

అన్నయ్యా..!

ఆరోజు.. ఇంకా గుర్తు అన్నయ్యా ఆరోజు.. ! 2009 general elections results counting రోజు !!
ఆ రోజు.. రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా పై నీ ఆధిపత్యాన్ని ఓర్వ లేక నీ ఓటమి కోసం ఎదురు చూస్తున్న గుంటనక్కల కల నిజమైన రోజు..!

ఆ రోజు వానపాములు సైతం బుసకొట్టడం మొదలుపెట్టిన రోజు..!

తమ తమ సొంత చానెల్స్ వాడుకుని  నీ ప్రతిష్ట  దిగజార్చడానికి ఏ అవకాశాన్ని వదులుకోకుండా అహర్నిశలు శ్రమిస్తున్న కొన్ని వర్గాలు  నిన్ను టికెట్ లు అమ్ముకున్న వాడిగాను.. సొంత ఊరికి ఏమి చేయని స్వార్థపరుడుగానూ పదే పదే అంటుంటే పోనీ వాళ్ళ నాయకులు ఏమైనా మహాత్ములా అని ఎవరు అడిగినా లేకున్నా.. నువ్వు ఆ స్థాయికి దిగజారవని నా మనసు చెప్తుంది అన్నయ్యా అని ఎవరికి చెప్పగలం? ఎలా చెప్పగలం?

ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని ఫోటోషాప్ కొంచెం చేయగల ప్రతి వెధవ నీ మీద అవాకులు చెవాకులు పేలడం.. ఉన్నవి లేనివి రాసి ఫేస్బుక్ పేజీ ఒకటి పెట్టి దానిలో పోస్ట్ చేయడం..! పోనీ వాడు చదువు సంధ్య లేని వెధవ.. వాడు అలాగే పెడతాడు అనుకుందాం.. మరి చదువుకున్న వెధవలు "ఆ పేజీ ద్వారా ప్రపంచాన్ని చూడటానికి ఇష్టపడటం"  అది నిజమో కాదో, రాసినోడి అర్హత ఏంటి? ఉద్దేశ్యం ఏంటి ? తెలుసుకోకుండా పెట్టి పెట్టగానే వాటిని షేర్ చేయడం, లైక్ చేయడం.. మమ్మల్ని బాధించినా చెప్పుకోలేని పరిస్థితి..! నీకోవిషయం తెలుసా అన్నయ్యా..   అలాంటి షేర్స్ లో 100% అబద్దాలు సరేసరి పైగా చాలా వాటిలో Spelling కూడా  mistakes లే , ఒక్క  ADMIT IT తప్ప ! అప్పుడు కూడా వాళ్ళ ఏడుపులే నీకు శ్రీరామరక్ష అని మాకు మేము చెప్పుకుని, నువ్వు ఏంటో  మాకు తెలుసు అన్నయ్యా అని  చెప్పాలని ఉన్నా.. ఎవరికి చెప్పగలం? ఎలా చెప్పగలం?

తెలుగు సినిమా ని ఎల్లలు దాటించిన నీ ఖ్యాతి గురించి చానెల్స్ వాళ్ళు తగ్గించేసి, రజనీతో సమాన స్థాయి అనుభవించిన నిన్ను తక్కువ చేసి మాములు హీరో లతో కలిపేసి మాట్లాడుతుంటే.. ఆయన స్థాయి ఏంటో మీకు తెలుసా అని వాళ్లకి.. వాళ్ళను పట్టించుకోవధ్ధు అన్నయ్య.. నువ్వు సాధించిన విజయాలు.. ప్రత్యర్థులకు మిగిల్చిన నిద్రలేని రాత్రులు ఎవరికి  తెలియనివి? అని చెప్పాలని ఉన్నా.. ఎవరికి చెప్పగలం? ఎలా చెప్పగలం?

నువ్వు ఏదో పోలింగ్ బూత్ లో  లైన్ కట్ చేసావని నేషనల్ మీడియా లో పదే పదే చూపించిన వాళ్ళు టూరిజం మినిస్టర్ గా నువ్వు చేసిన పనులు అరకొర తప్ప ఎక్కడ చూపించకపోయినా నీ చిత్థశుద్ధి మాకు తెలుసు అన్నయ్యా అని చెప్పాలని ఉన్నా.. ఎవరికి చెప్పగలం? ఎలా చెప్పగలం?

నీ మీద రోజుకో ఆర్టికల్ రాసే గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్ ఎంత అక్కసు కక్కినా, నీతో సినిమా అవకాశం ఆశించో ఇంకోటేదో ఆశించో దక్కని సదరు సంస్కారహీన ప్రముఖులు  నీ మీద అక్కడాఇక్కడ ఎన్ని కామెంట్స్ చేసిన మా మనసులో నీ బొమ్మ కి మసి పట్టదని చెప్పాలని ఉన్నా.. ఎవరికి చెప్పగలం? ఎలా చెప్పగలం?

స్క్రీన్ మీద నువ్వు నవ్వుతుంటే మాకు నవ్వొచ్ఛేదే, నువ్వు బాధ పడితే మాకు బాధకలిగేదే.. ఏ నలుగురు కలిసినా నీ గురించేనే.. మాకు రోల్ మోడల్ వి.. మరి అలాంటి నిన్ను ఇందరు ఇన్ని రకాలుగా తక్కువగా చూస్తుంటే.. సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే.. ఛీత్కారాలు.. వెటకారాలు ఎదుర్కుంటూ ఇలా జీవితాంతం గడిపేయడమేనా ? ఏమో ఎం చెయ్యాలో కూడా తెలీదు.. నీకు మాకు మధ్యా ఈ మీడియా ఏంటి? ఈ విజయాలు , ఓటముల లెక్కలు ఏంటి? అని తలుచుంటుంటే గుండెలు బరువెక్కుతూ ఉండేది.. ఇలా ఒకటా రెండా ? అరడజను పైగా సంవత్సరాలు గడచిపోయాయి.. మేము మా మనసులకి ముసుగులేసేసుకున్నాం అన్నయ్యా.. అప్పటి ఉత్సాహం లేదు.. భారం మాత్రం అలాగే ఉండిపోయింది గుండెల్లో..! ఇవన్నీ చెప్పుకోవాలని ఉన్నా.. ఎవరికి చెప్పగలం? ఎలా చెప్పగలం?

మొన్నా మధ్యనే తెలిసింది నువ్వు కత్త్తి రీమేక్ చేస్తున్నావని.. నిజానికి నాకు అది అంత మంచినిర్ణయం కాదేమో అనిపించింది.. మరలా వెనక్కి వఛ్చి ఈ వయసులో హాస్యాస్పదం ఐపోతావేమో అనే భయం.. సరే నువ్వు రీమేక్ చేస్తున్నావు అని తెలియగానే సహజం గానే అక్కుపక్షులు కారుకూతలు కూశాయి.. మాకు అలవాటైపోయాయి కాబట్టి పట్టించుకోలేదు..!

అప్పట్లో నీ షూటింగ్ ఎన్నో షెడ్యూల్ జరుగుతుందో.. ఎక్కడ జరుగుతుందో.. ఫాలో అవుతుందే నేను ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేవరకు కూడా పెద్దగా పట్టించుకోలేదు..!

కానీ అన్నయ్యా ఈరోజు..! నువ్వు మా ముందుకు వస్తున్న ఈరోజు.. నీకు మాకు మధ్య మీడియా లు, మూడో వ్యక్తులు లేని ఈరోజు.. థియేటర్ లో కూర్చుంటే తెరమీద నువ్వు.. నీ ముందు అదే ఆరాధనతో నేను ఉన్న ఈరోజు..!!

ఒక్కసారి ఉద్వేగం.. ఆనందం. ఏదో చెప్పలేని అనుభూతి..!

నేను సరే ఏదో మాములుగా కూర్చున్న కానీ మిగిలిన వాళ్ళు ఆలా లేరే.. అప్పట్లో లాగానే టెంకాయలు కొడుతున్నారు.. హారతులు పడుతున్నారు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల మంది ఏంటి ఈ అభిమానం ఇన్నేళ్ల తర్వాత కూడా ? ఆలోచిస్తే

నేను చిన్నప్పుడు బర్త్డే రోజు సెలెబ్రేట్ చేసుకోడానికి నీ సినిమాకి వెళ్ళేవాడిని
పరీక్షలు అయిపోయాక రిలీఫ్ కోసం నీ సినిమాకి వెళ్ళేవాడిని
రిజల్ట్స్ వచ్చాక  ఆనందం రెట్టింపు చేసుకోడానికి నీ సినిమాకి వెళ్ళేవాడిని
ఇలా ఒకటా రెండా ? నా జ్ఞాపకాల ప్రతి మలుపు లోను నాతో పటు నువ్వు కూడా ఉన్నావ్.. ! నాకే కాదు నా లాంటి లక్షల మందికి వాళ్ళ సంతోషం లోను , బాధ లోను నీకు తెలియకుండానే నువ్వు ఉన్నావ్ ! ఈ రోజు వాళ్ళు కూడా నాలాగే నిన్ను చూడటానికి వచ్చారు


నాలాగే వాళ్ళ గుండెల్లో కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళమీద కోపం ఉంది, గుండెల నిండా భారం ఉంది.. కానీ వాళ్ళు  కూడా నాలాగే నీ మీద చెక్కుచెదరని అభిమానం తో నీతో ఎప్పటికి మేము ఉన్నాం అని చెప్పడానికి వచ్చారు.. ఆలా ఇలా కాదు అన్నయ్య అప్పట్లో లాగానే అదే ఉత్సాహం తో , ఉత్సవం గా వచ్చారు..! ఇక్కడ నీ ప్రతిభని నీ గొప్పతనాన్ని నటనలో నీ మాయని నీకున్న ప్రజాకర్షణని తగ్గించడానికి మన మధ్య అడ్డుగా ఎవరు లేరు..! అన్నయ్య నేరుగా చూసాం. నీకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అని తెలుసుకున్నాం.. ఎవడు ఎన్ని చెప్పినా నువ్వు ఎవ్వరికి అందనంత ఎత్తులోఉన్నావని ప్రత్యక్షం గా తెలుసుకున్నాం మా గుండెల భారాన్ని దించుకున్నాం !

చూసావు కదా అన్నయ్య.. మా రిసెప్షన్ , అడ్వాన్స్ బుకింగ్స్, రికార్డు కలెక్షన్స్.. నీ మీద మా ప్రేమ శాశ్వతం అని ఎలా చెప్పగలము అన్నయ్య ఇంతకన్నా ??


-నీ అభిమాని గణపతి 

Friday 6 January 2017

గణపతి గారి అన్నయ్య

గణపతి గారి అన్నయ్య (అంటే నాకు ఏమవుతారో చెప్పక్కర్లేదు అనుకుంట)

ఆయన మరల Khaidi.No.150 తో మన ముందుకి వస్తున్న సందర్భం లో గుర్తున్న కొన్ని ఙ్ఞాపకాలు

గడియారం లో పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు చూసి "టైం ఎలా చూడాలో" మా నాన్న నేర్పించే "టైం" కె నేను అతని అభిమానిని.. అందుకే తర్వాత కాలం లో caste విషయాలు, ప్రజారాజ్యం పరాజయాలు కూడా అతని మీద నాకున్న అభిమానాన్ని తగ్గించలేదు

రాముడు-1000, లక్ష్మణుడు-900 ఇలా చిట్టీ ల మీద రాసుకుని నేను ఆడింది ఒక్కసారి మాత్రమే.. ఎందుకంటే ఆ తర్వాత అంత చిరంజీవి-1000, నాగార్జున-900 గా మార్చేసుకున్నాం

Welcome 1990, Good Bye 1989, Happy New Year అని నేను రాసిన మొట్ట మొదటి గ్రీటింగ్ కార్డు మీద ఉన్న బొమ్మ అతనిదే.. నాకు అందిన గ్రీటింగ్ మీద ఉన్న బొమ్మ కూడా అతనిదే.. ఆ గ్రీటింగ్ వెల కేవలం ఒక్క రూపాయి.. విలువ మాత్రం జీవితకాలపు జ్ఞాపకం (మతి మెరుపు జబ్బు లో సైతం 😜 )

నేను మొట్టమొదటి చుసిన తెలుగు సినిమా గుర్తు లేదు కానీ హిందీ సినిమా మాత్రం "ఆజ్ కా గూండా రాజ్ " ఆయన హీరో కాకపోతే అంత చిన్న వయసులో హిందీ సినిమా చూడటం జరిగి ఉండేది కాదనుకుంటా



ఈటీవీ జెమినీ టీవీ లు వచ్చినా కూడా మా పల్లెటూరికి రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది.. అప్పట్లో ఒకసారి ఏకలవ్యుడు అనే కృష్ణ గారి సినిమా దూరదర్శన్ లో వస్తుంది.. టైటిల్స్ లో ఎక్కడో ఒక చోట చిరంజీవి అని కనిపించింది.. అది అతనే అనుకుని ఆ సినిమా లో ఉన్నాడు అనుకుని సినిమా చివరి వరకు చూసేసిన అతడు కనిపించలేదు.. అంతగా ఉండేది ఆయన మీద అభిమానం

అప్పట్లో మా ఊర్లో సడన్ గా కుర్రాళ్లందరికి (మా కంటే పెద్ద వాళ్ళు) కళ్ళు నేత్త్తికెక్కాయి ! ఏంటబ్బా అనుకుంటే తెలిసింది అది అప్పటి లేటెస్ట్ ట్రెండ్ అని చిరంజీవి కళ్ళజోడు తల మీద పెట్టుకున్నాడని.. కొందరు ఒక అడుగు ముందుకేసి చొక్కా చేతులు కూడా చింపేసుకున్నారండి.. అది కూడా ఆయన చలవే.. ఆమాట కొస్తే ఆయన వల్ల ఇంకా చాలానే జరుగుతుండేవి.. ఇంట్లో చిల్లర డబ్బులు, బడి లో అటెండెన్స్ లాంటివి

ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకే లేచి నాన్న తో పొలం వెళ్లే రోజుల్లో అప్పుడప్పుడు  ఒక ముప్పై నుండి నలభై సైకిల్స్ ర్యాలీ గా బెల్స్ కొట్టుకుంటూ కేరింతలు తుళ్ళింతలతో వెళ్లడం చూసేవాళ్ళం అంటే ఆ రోజు ఆయన సినిమా రిలీజ్ అన్నమాట ! తర్వాత కాలం లో ఎన్ని బైక్స్ ర్యాలీస్ చూసాం, కార్ ర్యాలీస్ చూసాం.. చూస్తున్నాం

సినిమా నచ్చడమే సక్సెస్ అనుకుంటే మృగరాజు వరకు నా వరకు అన్ని సినిమాలు సక్సెస్, అప్పటివరకు నచ్చని చిరంజీవి సినిమా అంటూ ఏమి లేదు..

ఇంటర్ చదవటానికి హాస్టల్ కి వెళ్లెవరకూ తెలీదు వేరే హీరోస్ కి కూడా ఫాన్స్ ఉంటారని.. వాళ్ళు మారుతూ ఉంటారని.. ఉదాహరని కి ప్రేమికుడు వచ్చినపుడు ప్రభుదేవా, జెంటిల్మన్ వచ్చినపుడు అర్జున్ ఇలా ఎవరు హిట్ కొడితే వాళ్ళు ఆయనకు పోటీ.. వాళ్ళ హీరోస్ మారుతూ ఉండేవాళ్లు కానీ వాళ్ళ ప్రత్యర్థి మాత్రం ఆయనే ! అప్పటివరకు అభిమానానికి కారణం అభిమానం మాత్రమే అనుకునే నాకు.. వేరే హీరో మీద దురభిమానం కూడా ఒక హీరో మీద అభిమానానికి కారణం అవుతాదని తెలిసింది

వాళ్ళని చూస్తే జాలేసేది.. నవ్వోచ్ఛేది ఏడిపించాలి అనిపించేది.. కావాలని డిస్కషన్ స్టార్ట్ చేసి ఉడికించడం గొడవలకు దారితీసేది.. ఇక్కడ ఒక సరదా సంఘటన

ఒకరోజు అలాగే డిస్కషన్ పెద్దదయింది మేము పదిమంది ఉంటె వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళు అంతే మేము రెచ్చ్చిపోయి ఏడిపించడం తో వాళ్ళు ఏడ్చేసి వార్డెన్ కి కంప్లైంట్ చేసారు అది కాస్తా ప్రిన్సిపాల్ గారి వరకు వెళ్లి ఆయన అందరికి వార్నింగ్ ఇచ్చి ఇకపై ఇలాంటివి జరిగితే నాకు వఛ్చి చెప్పు అని వాళ్ళ ముగ్గురికి చెప్పి వెళ్లిపోయారు.. అయినా మనం కుదురుగా ఉండలేం కదా ఆలా అని వాళ్ళ హీరో ని కామెంట్ చేస్తే కంప్లైంట్ చేస్తాడని భయం అందుకు indirect గా కామెంట్ చేయడం మొదలు పెట్టాం అది ఎలా అంటే "చిరంజీవి ఫోటో తీసి వాళ్ళకి వినిపించేలా.. చిరంజీవి ని కామెంట్ చేసేవాళ్ళం.. వీడేం హీరో రా బాబు వేరే హీరోస్ చూడు ఎంత బాగా acting చేస్తారో fighting చేస్తారో dance లు చేస్తారో లాంటివ..  అవన్నీ అబద్ధాలని వాళ్ళకి తెలుసు, వీళ్ళు ఇలా కెలుకుతున్నారు అని కూడా తెలుసు.. పోనీ అవును మీరంటున్నవి అన్ని నిజమే మీ వాడు వేస్ట్ అంటే మల్లి వాళ్ళ హీరో ఇంకెంత వేస్ట్ అని ప్రూవ్ చేస్తామో అని భయం వాళ్ళకి.. ఇలా మా హీరో మీద మేము కామెంట్ చేసుకోవడం వలన  స్పోర్టివ్ స్పిరిట్ పెరిగిపోయింది మా బ్యాచ్ అందరికి.. ట్విట్టర్ లో చిరంజీవి అభిమానులు అతని మీద అతని ఫామిలీ మీద కామెంట్స్ చేస్తుంటారు (ము) కారణం అదే అనుకుంట.. ఏ హీరో ఫాన్స్ కూడా వాళ్ళ హీరో మీద అన్ని ట్రోల్ల్స్ వేసుకోరు.. వాళ్ళు మెగా ఫాన్స్ అయితే తప్ప.. వాళ్ళ confidence  అల్లాంటిది

ఇక సినిమా రిలీజ్ డే సెలెబ్రేషన్స్, శతదినోత్సవాలు, ఆయన పుట్టినరోజులు, ఆడియో కేసెట్ లైబ్రరీ, తర్వాత కాలం లో లు mp3 వచ్చిన తర్వాత ఆయన పేరు మీద ఫోల్డర్ అందులో ఆయన సినిమా పాటలు.. ఇప్పుడైతే ఆయన పేరు మీద ప్లే లిస్ట్

ఇంకా చాలా రాయాలని ఉంది బట్ బోర్ కొట్టించకూడదని ఆపేస్తున్న.. Once again wishing him all the best.. BOSS IS BACK